Advertisement

  • మేము ఎవ్వరిని హౌస్ అరెస్ట్ చేయలేదు ...ఢిల్లీ పోలీసులు

మేము ఎవ్వరిని హౌస్ అరెస్ట్ చేయలేదు ...ఢిల్లీ పోలీసులు

By: Sankar Tue, 08 Dec 2020 12:36 PM

మేము ఎవ్వరిని హౌస్ అరెస్ట్ చేయలేదు ...ఢిల్లీ పోలీసులు


ఢిల్లీ రాష్ట్ర సీఎంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని పార్టీ నేతలు అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కేజ్రీవాల్ పరామర్శించిన విషయం తెలిసిందే.

రైతులను కలిసి వచ్చిన వెంటనే పోలీసులు అతడి ఇంటిని చుట్టుముట్టారని ఎవ్వరినీ లోపలకి వెళ్లకుండా, అతడిని బయటకు రానివ్వకుండా చేశారని. ఆయన్ను కలిసేందుకు వెళ్లిన ఎమ్మేల్యలను పోలీసులు కొట్టారని కూడా వారు అన్నారు. అయితే దానిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. అంతేకాకుండా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. కేజ్రీవాల్‌ను ఎవ్వరూ హౌస్ అరెస్ట్ చేయలేదని, దానికి ఢిల్లీ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో పాటు.

కేజ్రీవాల్ నివాసం ఎంట్రన్స్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ మేము ఎవ్వరిని హౌస్ అరెస్ట్ చేయలేదు. ఈ నిందలను మేము వ్యతిరేకిస్తున్నాం. అతడు ఎక్కడికైనా వెళ్లవచ్చు. అతడిని మేము బందించలేద’ని పోలీసలు అన్నారు.

Tags :
|
|
|

Advertisement