Advertisement

  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు తనిఖీలు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు తనిఖీలు

By: chandrasekar Mon, 10 Aug 2020 7:44 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు తనిఖీలు


స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసు బలగాలు సోమవారం వాహనాల తనిఖీ ప్రారంభించాయి. ఇండియా గేట్‌, కన్నాట్‌ ప్లేస్‌లో పోలీసులు, ఎన్‌సీఆర్‌లోని అన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి.

ఆదివారం, 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వేడుకల సందర్భంగా ఇండియన్ ఆర్మ్డ్‌ ఫోర్సెస్‌ (ట్రై సర్వీస్‌) బ్యాండ్‌ నార్త్‌ బ్లాక్‌లో సంగీత ప్రదర్శన ఇచ్చింది.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన బృందాలు సంగీత ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘ఈ ప్రదర్శనలు తమ ప్రాణాలకు ముప్పు ఉన్నా దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అడ్డుకునేందుకు నిరంతరం పోరాడుతున్న కరోనా యోధుల పట్ల దేశం కృతజ్ఞతగా నిర్వహిస్తున్నట్లు’ రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆగస్టు 12న భోపాల్, ఇంఫాల్ , ఝాన్సీల్లో కూడా మిలటరీ, పోలీస్‌ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించనున్నాయి. ఈ సిరీస్ చివరి ప్రదర్శన ఆగస్టు 13న లక్నో, షిలాంగ్, ఫైజాబాద్, మధురై జరుగనుందని తెలిపింది.

Tags :

Advertisement