Advertisement

  • కరోనా నుంచి కోలుకున్నవారు క్రమం తప్పకుండ ఇవి చేయాలి.. ఢిల్లీ ఆరోగ్య మంత్రి

కరోనా నుంచి కోలుకున్నవారు క్రమం తప్పకుండ ఇవి చేయాలి.. ఢిల్లీ ఆరోగ్య మంత్రి

By: Sankar Sat, 29 Aug 2020 10:36 PM

కరోనా నుంచి కోలుకున్నవారు క్రమం తప్పకుండ ఇవి చేయాలి.. ఢిల్లీ ఆరోగ్య మంత్రి


కొవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా యోగా చేయాలని, రోగనిరోధకశక్తిని పెంచే హెర్బల్ డ్రింక్స్ తాగాలని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్ (55) సూచించారు. మంత్రి కూడా ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నారు. ‘కరోనా నుంచి కోలుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ పేరుతో ఓ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో మంత్రి విడుదల చేశారు. ఓ మంత్రిగా కాకుండా కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిగా చెబుతున్నానని అందులో పేర్కొన్నారు.

ఇంట్లో చిత్రీకరించిన ఆ వీడియోలో మంత్రి పలు యోగాసనాలు వేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా యోగా చేయండి. కొవిడ్ రోగులలో శ్వాస ఒక ప్రధాన సమస్య. యోగాసనాలు ఆరోగ్యకరమైన శ్వాస తీసుకోవడానికి సహాయపడతాయి’’ అని పేర్కొన్నారు.

యోగాను నిత్యకృత్యంగా చేసుకోవాలని, ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం సుమారు 20 నిమిషాలు, రోజుకు మూడుసార్లు ప్రాణాయామం చేయాలని సూచించారు. కొవిడ్ కారణంగా ఎదురైన శారీరక, మానసిక ఒత్తిడిని యోగా పోగొడుతుందని వివరించారు.

Tags :
|
|

Advertisement