Advertisement

  • ఢిల్లీలో యాబై శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

ఢిల్లీలో యాబై శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

By: Sankar Sun, 29 Nov 2020 10:59 AM

ఢిల్లీలో యాబై శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్


కొవిడ్‌ పాజిటివిటీరేటు తగ్గినా.. ముందస్తు జాగ్రత్త చర్యగా 50శాతం మంది ఉద్యోగులకు వచ్చే వారం నుంచి వర్క్‌ఫ్రం హోం ఇవ్వనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

రెవెన్యూశాఖ పంపిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ నేతృత్వంలోని విపత్తు నిర్వహణ అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ప్రైవేటు కార్యాలయాలు వీలైనంత వరకు వర్క్‌ఫ్రం హోం పాలసీని అనుసరించాలని సూచించింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతోంది.

అయితే గత కొద్ది రోజులుగా పాజిటివిటీ రేటు నిరంతరం తగ్గుతూ వస్తుండగా.. 9శాతం కంటే తక్కువగా ఉంది. నవంబర్‌ 7 నుంచి ఢిల్లీలో కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోంది. శనివారం ఐదువేల లోపు కంటే తక్కువ కేసులు నిర్ధారణ కాగా.. 89 మరణాలు సంభవించగా.. పాజిటివిటీ రేటు 7.24గా నమోదైంది. ప్రజలు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు పాటించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కోరారు.

Tags :
|
|

Advertisement