Advertisement

  • కరోనా మరియు డెంగ్యూ తో బాధ పడుతున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

కరోనా మరియు డెంగ్యూ తో బాధ పడుతున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

By: chandrasekar Fri, 25 Sept 2020 09:07 AM

కరోనా మరియు డెంగ్యూ తో బాధ పడుతున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా


కరోనా మరియు డెంగ్యూ తో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బాధపడుతున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కరోనా వైరస్ బారిన పడ్డారు. మనీష్ సిసోడియాకు డెంగ్యూ జ్వరం కూడా ఉందని వైద్యులు నిర్ధారించారు. ఢిల్లీ ప్రభుత్వ నడుపుతున్న ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రిలోని ఐసీయూలో మనీష్ సిసోడియా చికిత్స పొందుతున్నారు. ఈనెల 23న ఆయన కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరగా, పరీక్షల్లో భాగంగా ఆయనకు డెంగ్యూ కూడా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు మనీష్ సిసోడియా కార్యాలయం ప్రకటించింది.

కరోనా తో బాటు డెంగ్యూ కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఆవహించింది. అనారోగ్యం వల్ల ఆయన బ్లడ్ ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోతోంది. ఆయన లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరం, ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కరోనా పాజిటివ్ కూడా నిర్ధారణ అయిందని సిసోడియా కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

మనీష్ సిసోడియాకు 48 సంవత్సరాలు అతను సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఐసీయూలో ఉంచి ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 14న మనీష్ సిసోడియాకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 14న ఒకరోజు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు.

Tags :

Advertisement