Advertisement

కరోనా కేసుల్లో ముంబై ను దాటినా ఢిల్లీ

By: Sankar Thu, 25 June 2020 5:20 PM

కరోనా కేసుల్లో ముంబై ను దాటినా ఢిల్లీ



కరోనా కేసుల నమోదు విషయంలో ముంబై , ఢిల్లీ పోటీపడుతున్నాయి ..నిన్నటిదాకా అత్యధిక కరోనా కేసుల్లో ముంబై తొలి స్థానములో ఉంటె తాజాగా ఢిల్లీ ముంబై ని మించి తొలి స్థానానికి చేరింది .. సోమవారం ఉదయానికి ఢిల్లీలో నమోదైన కరోనా కేసులు 70,390. ఇదే సమయానికి ముంబైలో ఉన్న కేసుల సంఖ్య 69,529.మే 29 నుంచి ఢిల్లీలో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైనే నమోదవుతూ వస్తున్నాయి. మే 31ను బేస్ లైన్ గా తీసుకుంటే, అప్పటిదాకా నమోదవుతున్న కేసులు రోజుకు మూడింతలు పెరిగాయి.

అందరూ జులైలో ముంబైని, ఢిల్లీ దాటేస్తుందని భావించారు. కానీ, ఓ వారం ముందే ఢిల్లీ ఆ స్థాయిని చేరుకుంది. జూన్ 23న ఢిల్లీలో 3947 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచం మొత్తం మీద కూడా ఒకే నగరంలో ఇన్ని కేసులు బయటపడలేదు.ఢిల్లీలో ప్రతి పది లక్షల మందికి 22,142 మందికి కరోనా టెస్టులు జరిగాయి. ముంబైలో ఈ సంఖ్య 22,668గా ఉంది. ఇదే టైంలో ముంబైలో పాజిటివ్ రేటు 23 శాతం కాగా ఢిల్లీలో కేవలం 17 శాతం మాత్రమే. కొన్ని రోజులుగా ఈ పరిస్థితి మారింది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ పాజిటివ్ రేటు సమానమైంది.

ముంబైలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య జూన్‌లో తగ్గుముఖం పట్టింది. గత వారం కేసుల పెరుగుదల 2.7 శాతం నుంచి 2.4 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా రోజూ బయటపడుతున్న కేసుల రేటు 3.3 శాతంగా ఉంది. ఢిల్లీలో కేసుల డబులింగ్ రేటు 12కి తగ్గింది.ఢిల్లీ వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 45 లక్షల ఇళ్లలో కేసుల పరీక్ష చేయాలని నిర్ణయించింది. ఇది రెండు దశల్లో జరగనుంది. జూన్ 30 నాటికి కంటైన్‌మెంట్ జోన్లలో, మిగతా నగరానికి జులై 6 కల్లా పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు.


Tags :
|
|
|

Advertisement