Advertisement

  • ప్లాస్మా దానం చేయండి ..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

ప్లాస్మా దానం చేయండి ..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

By: Sankar Mon, 29 June 2020 3:41 PM

ప్లాస్మా దానం చేయండి ..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్



కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తుండటంతో ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు..కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై , ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ప్లాస్మా దానం చేయాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కరోనా నుంచి కోలుకున్న వారిని అర్ధిస్తున్నారు ..నిన్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్లాస్మా దానం చేయాలనీ పిలుపునిస్తే..ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్లాస్మా దానం చేయాలనీ కోరారు ..

ఇక కరోనా రోగుల చికిత్స కోసం ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. రెండు రోజుల్లో ప్లాస్మా బ్యాంక్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు ప్లాస్మాను దానం చేయాలని ఆయన కోరారు..అలాగే అతిపెద్ద కోవిడ్‌-19 సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటి సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తోంది అని తెలిపారు ..

కరోనా మహమ్మారితో మరణించిన డాక్టర్‌ అసీం గుప్తా కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రూ కోటి పరిహారం ప్రకటించారు. ఢిల్లీలో 29 మంది కరోనా రోగులపై ప్లాస్మా థెరఫీ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్లాస్మా దాతలు, అవసరమైన రోగుల మధ్య ప్లాస్మా బ్యాంక్‌ సంథానకర్తగా వ్యవహరిస్తుందని కేజ్రీవాల్‌ తెలిపారు. ఇక ఢిల్లీలో ఇప్పటివరకూ 83,077 కరోనా పాజిటివ్‌ కేసులలు వెలుగుచూశాయి.


Tags :
|
|
|

Advertisement