Advertisement

  • క‌రోనా యాప్‌ను‌ ఆవిష్క‌రించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

క‌రోనా యాప్‌ను‌ ఆవిష్క‌రించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

By: chandrasekar Wed, 03 June 2020 2:45 PM

క‌రోనా యాప్‌ను‌ ఆవిష్క‌రించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్


హాస్పిట‌ళ్ల‌లో అందుబాటులో ఉన్న బెడ్స్‌కు సంబంధించిన స‌మాచారంతో క‌రోనా యాప్‌ను త‌యారు చేసిన‌ట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో నాలుగు అడుగులు ముందే ఉన్నామ‌న్నారు.

హాస్పిట‌ళ్ల‌లో బెడ్లు, ఐసీయూలు, వెంటిలేట‌ర్లు అన్నీ అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు. హాస్పిట‌ళ్ల‌లో మంచాలు, వైద్య స‌దుపాయాల లోటు ఉన్న‌ట్లు ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని, ప్ర‌స్తుతం ఢిల్లీలో సుమారు 4100 మంచాలు ఖాళీగా ఉన్న‌ట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే భ‌విష్య‌త్తులో బెడ్స్‌కు సంబంధించిన ఫిర్యాదు రాకుండా ఉండేందుకు యాప్‌ను ఆవిష్క‌రించిన‌ట్లు సీఎం చెప్పారు.

ఆ యాప్ ద్వారా ప్రైవేటు, ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్ల స‌మాచారం పొందుప‌రిచామ‌న్నారు. ప్ర‌తి హాస్పిట‌ల్‌లో ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయో ఆ యాప్ ద్వారా తెలుస్తోంద‌న్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో 302 వెంటిలేట‌ర్లు అందుబాటులో ఉన్న‌ట్లు కేజ్రీ తెలిపారు. ఉద‌యం 10 గంట‌ల‌కు, సాయంత్రం 6 గంట‌ల‌కు హాస్పిట‌ల్ స‌మాచారంతో యాప్‌ను అప్‌డేట్ చేస్తామ‌న్నారు. ఆస్పత్రుల‌పై ఏదైనా ఫిర్యాదు చేయాల‌నుకుంటే 1031 నెంబ‌ర్‌కు ఫోన్ చేయాల‌న్నారు.


Tags :
|
|

Advertisement