Advertisement

  • ప్లాస్మా దానం చేసిన తెలుగు జర్నలిస్ట్ ను ప్రశంసించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ప్లాస్మా దానం చేసిన తెలుగు జర్నలిస్ట్ ను ప్రశంసించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

By: chandrasekar Wed, 08 July 2020 2:35 PM

ప్లాస్మా దానం చేసిన తెలుగు జర్నలిస్ట్ ను ప్రశంసించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్


కరోనాపై జరుగుతున్న పోరాటంలో వైద్యులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఐతే జర్నలిస్టులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు.

కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే కరోనా టెస్ట్‌లు మొదలుకొని, కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల వరకు అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. ఫీల్డ్‌లో రిపోర్టింగ్ చేస్తూ ఎంతో మంది విలేఖరులు కరోనా బారినపడ్డారు. ఐతై జర్నలిస్టుగా కేవలం వార్తలను అందించడమే కాదు. సామాజిక బాధ్యతతో ఓ జర్నలిస్ట్ ప్లాస్మా దానం చేస్తున్నారు.

ఢిల్లీలోని ప్లాస్మా బ్యాంక్‌లో తెలుగు జర్నలిస్ట్ మహాత్మా కొడియార్ ప్లాస్మా దానం చేసి నలుగురికీ ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.

రక్తదానం ప్రాణాలు కాపాడుతుంది. ఇది కొత్త విషయం కాదు. కానీ అసలు ఇప్పటి వరకు మందే లేని మహమ్మారికి మన రక్తం ఔషధంగా మారి ప్రాణదానం చేస్తుందంటే అది కచ్చితంగా అరుదైన అవకాశమే. ఆ అవకాశం నాకు దక్కడం నిజంగా నా అదృష్టమే అనుకుంటున్నాను అని మహాత్మా కొడియార్ అన్నారు.

మహాత్మా కొడియార్ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌లో ఢిల్లీ రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐతే కొన్ని రోజులు క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఎదుర్కొని కరోనాపై గెలిచారు. ఐతే కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తన వంతు బాధ్యతగా ప్లాస్మా దానం చేశారు.

Tags :

Advertisement