Advertisement

  • కరోనా ఫ్రీ వ్యాక్సిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

కరోనా ఫ్రీ వ్యాక్సిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

By: Sankar Sun, 25 Oct 2020 07:13 AM

కరోనా ఫ్రీ వ్యాక్సిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్


దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా అందించాలని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీహార్‌లో వ్యాక్సిన్‌ను కరోనా బాధితులకు ఉచితంగా ఇస్తామని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. దానిపై ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ మాట్లాడారు. కరోనా బాధితులకే కాకుండా ప్రజలందరికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని అడిగాడు.

‘దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలి. అదివారి హక్కు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డార’ని కేజ్రీవాల్ అన్నారు. అయితే బీహార్‌లో బీజేపీ చేసిన వాగ్దాలను ప్రశ్నిస్తున్నానన్నాడు. ప్రతిపక్షాలపై గెలవడానికి ప్రజల అవసరాలను వాడుకోవడం నేరమని, తమిళనాడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇదే పోకడ పోతున్నారని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన 11 పాయింట్ల డాక్యుమెంట్లో బిహార్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉయితంగా ఇవ్వడం సాధ్యమని ఉందన్నారు.

భారత్‌లో వ్యాక్సిన్ తయారీ మొదలు అయిన తరువాత వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామన్నట్లు బీజేపీ మానిఫెస్టోలో ఉందని తెలిపారు. అయితే దీనిపై బీజేపే స్పందించింది. వ్యాక్సిన్‌ను అందరికీ ఉచితంగా ఇస్తామని కాకపోతే ఉచితంగా ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుందని పేర్కోంది. ఇదిలా ఉంటే బీహార్ పోల్ ఎలక్షన్స్ మూడు విడతలుగా నిర్వహించనున్నారు. అవి వరుసగా అక్టోబరు 28, నవంబరు 3, నవంబర్ 7ను పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ఫలితాలు నవంబరు 10న విడుదల చేయనున్నట్లు సమాచారం.

Tags :

Advertisement