Advertisement

  • కరోనా రెండో దశకు చేరుకున్న ఆ రాష్ట్రము ..అత్యవసరం అయితేనే బయటకు రావాలని సీఎం సూచనలు

కరోనా రెండో దశకు చేరుకున్న ఆ రాష్ట్రము ..అత్యవసరం అయితేనే బయటకు రావాలని సీఎం సూచనలు

By: Sankar Fri, 25 Sept 2020 07:10 AM

కరోనా రెండో దశకు చేరుకున్న ఆ రాష్ట్రము ..అత్యవసరం అయితేనే బయటకు రావాలని సీఎం సూచనలు


కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తున్నది. ప్రతిరోజూ 85 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. అయితే, కొన్ని చోట్ల కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి తిరిగి ఉదృతి కొనసాగిస్తోంది. ఇలా వైరస్ తగ్గుముఖం పట్టి తిరిగి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఢిల్లీ. ఆగష్టు వరకు కేసుల సంఖ్య అదుపులో ఉన్నది.

కానీ, సెప్టెంబర్ నుంచి తిరిగి కేసులు పెరగడం మొదలయ్యాయి. రాష్ట్రంలో సెకండ్ వేవ్ మొదలైనట్టు ఢిల్లీ సీఎం పేర్కొన్నారు. సెప్టెంబర్ 16 వ తేదీన అత్యధికంగా 4500 కేసులు నమోదయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖానికి ఫేస్ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడటం తప్పనిసరి అని పేర్కొన్నారు. అవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని కేజ్రీవాల్ హెచ్చరించారు.

ఇక గురువారం కొత్తగా 86,508 కేసులు నమోదు కాగా రికవరీలు మాత్రం 87,374గా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 57,32,518కి చేరుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 46,74,987కు చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 1,129 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 91,149కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,66,382గా ఉంది. యాక్టివ్‌ కేసులతో పోలిస్తే రికవరీలు 37 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 16.86 శాతం ఉన్నాయి

Tags :
|
|

Advertisement