Advertisement

  • దీపావళి జరుపుకుంటాం ...కానీ టపాసులు కాల్చం ...ఢిల్లీ సీఎం

దీపావళి జరుపుకుంటాం ...కానీ టపాసులు కాల్చం ...ఢిల్లీ సీఎం

By: Sankar Thu, 05 Nov 2020 7:17 PM

దీపావళి జరుపుకుంటాం ...కానీ టపాసులు కాల్చం ...ఢిల్లీ సీఎం


కరోనా వైరస్‌, కాలుష్యం నేపథ్యంలో దీపావళి నాడు ప్రజలు ఎవరు కూడా టపాసులు కాల్చవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు.

దీపావళి పండుగరోజు రాత్రి 7.39 గంటలకు ప్రభుత్వం లక్ష్మి పూజ నిర్వహిస్తోందని మంత్రులతో పాటు ప్రజలు కూడా ఆ వేడుకలలో పాల్గొనాలని కోరారు. ఢిల్లీ ప్రస్తుతం రెండు సమస్యలతో బాధపడుతుందని ఒకటి కరోనా అయితే మరొకటి వాయు కాలుష్యం అని అన్నారు. దీపావళికి టపాసులు కాల్చడం ద్వారా వాయు కాలుష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని అందుకే ప్రజలు ఎవరూ ఆ పని చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ, ‘ మేమందరం ఈ దీపావళిని కలిసి జరుపుకుంటాం. అయితే ఎవరం టపాసులు కాల్చం. ఇక్కడ మంచి వాతావరణంలో రెండు కోట్లమందికి మేలు జరగాలనే ఉద్దేశ్యంతో లక్ష్మి పూజ నిర్వహిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరగడానికి కూడా ఈ వాయు కాలుష్యం ఒక కారణమన్నారు. ఇప్పటికే కాలుష్యంతో ఢిల్లీ అల్లాడుతోందని అందుకే టపాసులు కాల్చవద్దని, అందరం కలిసి పూజ చేసుకుందామని సీఎం కోరారు. ఇదిలా వుండగా పశ్చిమ బెంగాల్‌ ఈ ఏడాది బాణాసంచా అమ్మకాలను నిషేధించారు

Tags :
|
|

Advertisement