Advertisement

  • చెన్నై కి చెక్ పెట్టిన ఢిల్లీ యువ జట్టు ..వరుసగా రెండో మ్యాచ్ లో ఓడిన ధోని సేన

చెన్నై కి చెక్ పెట్టిన ఢిల్లీ యువ జట్టు ..వరుసగా రెండో మ్యాచ్ లో ఓడిన ధోని సేన

By: Sankar Sat, 26 Sept 2020 06:46 AM

చెన్నై కి చెక్ పెట్టిన ఢిల్లీ యువ జట్టు ..వరుసగా రెండో మ్యాచ్ లో ఓడిన ధోని సేన


యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని యువ ఆటగాళ్లతో నిండిన ఢిల్లీ జట్టు దిగ్గజ ఆటగాడు ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తూ చేసింది..దీనితో చెన్నై వరుసగా రెండో మ్యాచ్లో ఓటమి చవి చూసింది..మొదట బాటింగ్ లో రాణించిన ఢిల్లీ ఆ తర్వాత బౌలింగ్ లో మరింత మెరుగ్గా రాణించి చెన్నై ని ఏ దశలో కూడా గెలుపుకోసం ప్రయత్నించకుండ చేసింది..

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పృథ్వీ షా (43 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. రిషభ్‌ పంత్‌ (25 బంతుల్లో 37 నాటౌట్‌; 5 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌ (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (35 బంతుల్లో 43; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... రబడ 3 వికెట్లు పడగొట్టాడు. గత మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌తో నెగ్గిన ఢిల్లీకి ఈ విజయంతో తమ సత్తాను ప్రదర్శించింది.

ఇక చాలా కాలం తర్వాత క్రికెట్‌ ఆడుతున్నాను కాబట్టి నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకుంటున్నానని గత మ్యాచ్‌లో చెప్పిన ధోని ఈసారి కూడా ప్రభావం చూపలేకపోయాడు. 26 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ధోని మరోసారి పరుగులు సాధించడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కుర్రాడు అవేశ్‌ ఖాన్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టినా, చివరకు కొండంత లక్ష్యం ముందు చేతులెత్తేయాల్సి వచ్చింది. 12 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన అనంత రం చివరి ఓవర్‌ మూడో బంతికి రబడ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కాస్త ముందుగా వచ్చి పాత ధోని తరహాలో జట్టును గెలిపించాలని కోరుకుంటున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.


Tags :
|
|

Advertisement