Advertisement

  • టైటిల్ ఏ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న యువ సారధులు..

టైటిల్ ఏ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న యువ సారధులు..

By: Sankar Sun, 20 Sept 2020 2:12 PM

టైటిల్ ఏ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న యువ సారధులు..


ఐపీయల్ లో రెండ మ్యాచ్ లో ఇద్దరు యువ ఆటగాళ్లు సారథ్యం వహిస్తున్న జట్లు ఈ రోజు తలపడనున్నాయి..అందులో ఒకటి శ్రేయాస్ అయ్యారు కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ అయితే , మరొక జట్టు రాహుల్ సారథ్యంలోని కింగ్స్ లెవెన్ పంజాబ్..రెండు జట్లు కూడా టైటిల్ ఏ లక్ష్యంగా ఈ సారి ఐపీయల్ లో బరిలోకి దిగుతున్నాయి.. ఐపీఎల్ 2019 సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో తలపడిన పంజాబ్, ఢిల్లీ.. చెరో మ్యాచ్‌‌లో గెలుపొందాయి. అయితే.. గత సీజన్లతో పోలిస్తే ఈసారి రెండు జట్లు మంచి సమతూకంతో కనిపిస్తున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యువ క్రికెటర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. పృథ్వీ షా, హిట్‌మెయర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌‌లతో మిడిలార్డర్ బలోపేతంగా కనిపిస్తుండగా.. ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కీమో పాల్, అశ్విన్‌తో బౌలింగ్ విభాగం కూడా మంచి సమతూకంతో ఉంది..ఇక ధావన్ , రహానే వంటి సీనియర్ ఆటగాళ్ల అండ కూడా ఢిల్లీ జట్టుకు ఉంది..

ఇక మరోవైపు క్రిస్‌గేల్, గ్లెన్ మాక్స్‌వెల్, నికోలస్ పూరన్ రూపంలో ఆ జట్టులో పవర్ హిట్టర్లు ఉన్నారు. ఇక బౌలింగ్‌ విభాగం కూడా మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్, గౌతమ్‌‌తో మెరుగ్గానే ఉన్నా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే పంజాబ్ బౌలింగ్ కాస్త బలహీనమనే చెప్పాలి. కాగా గత ఏడాది ప్లేఆఫ్‌కి చేరి.. టైటిల్‌కి రెండు అడుగుల దూరంలో నిలిచిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

Tags :

Advertisement