Advertisement

  • ఈ ఏడాదితో మా ఐపీయల్ టైటిల్‌ నిరీక్షణ తీరిపోతుంది ..కాగిసో రబడా

ఈ ఏడాదితో మా ఐపీయల్ టైటిల్‌ నిరీక్షణ తీరిపోతుంది ..కాగిసో రబడా

By: Sankar Wed, 09 Sept 2020 10:50 AM

ఈ ఏడాదితో మా ఐపీయల్ టైటిల్‌ నిరీక్షణ తీరిపోతుంది ..కాగిసో రబడా


ఐపీయల్ లో ఇప్పటివరకు టైటిల్ సాధించని జట్లలో ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్..ఎందరో స్టార్ ఆటగాళ్లు ఉన్న కుడా ఢిల్లీ ఎప్పుడు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది..అయితే గత ఏడాది మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో అద్భుతంగా రాణించింది.. అయితే.. ఈ ఏడాది ఆ టైటిల్ నిరీక్షణకి ఢిల్లీ క్యాపిటల్స్ తెరదించబోతోందని ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ధీమా వ్యక్తం చేశాడు..

ఐపీఎల్ 2019 సీజన్‌లో టైటిల్‌కి మేము చాలా చేరువగా వెళ్లాం. కాబట్టి.. ఈ ఏడాది కూడా అదే జోరుని కొనసాగించగలమనే నమ్మకంతో ఉన్నాం. గత ఏడాది ప్లేఆఫ్‌కి చేరడంతో జట్టులోనూ ధీమా పెరిగింది. కానీ.. ఇది కొత్త సీజన్ కావడంతో మళ్లీ ఫస్ట్ నుంచి జర్నీ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా టీమ్ మంచి సమతూకంతో ఉంది’’ అని రబాడ వెల్లడించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌లాడిన రబాడ 31 వికెట్లు పడగొట్టాడు.

కాగా ఐపీఎల్ 2019 సీజన్‌ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 9 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకుని 18 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా.. లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌ల్లో వరుస విజయాల్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది. కానీ.. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడ, పృథ్వీ షా తదితర యువ క్రికెటర్లతో నిండిన ఆ జట్టుని ప్లేఆఫ్‌లో అనుభవలేమి దెబ్బతీసింది.

Tags :
|

Advertisement