Advertisement

  • ఐపీయల్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీయల్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

By: Sankar Mon, 12 Oct 2020 1:01 PM

ఐపీయల్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్


ఐపీఎల్ 2020 లో ఆడుతున్న జట్లలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్ కు చేరని జట్టు ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ జట్టు ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో మూడు సార్లు ప్లే ఆఫ్ కి అర్హత సాధించిన ప్రతిసారి మూడోస్థానంలోనే ఆగిపోయింది.

అయితే ఎప్పుడు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివర్లో ఉండే ఢిల్లీ ఈ ఏడాది మాత్రం రెండో స్థానం లో కొనసాగుతుంది. అయితే నిన్న ముంబై ఇండియన్స్ తో ఆడిన మ్యాచ్ లో తీవ్రంగా శ్రమించిన ఈ యువ జట్టు చివర్లో ఓటమినే చూడాల్సి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ ఐపీఎల్ 13వ సీజన్ లో 7 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి రెండు ఓడిపోయింది. కానీ నిన్నటి ఓటమితో ఐపీఎల్ లో ఓ చెత్త రికార్డు మూటకట్టుకుంది ఈ జట్టు. మొత్తం ఐపీఎల్ టోర్నీలో ముంబై పై ఓటమితో 100 మ్యాచ్ లు ఓడిపోయిన రెండో జట్టుగా ఢిల్లీ నిలిచింది.

మొదటి స్థానంలో ఈ ఏడాది ఐపీఎల్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన పంజాబ్ ఉంది. ఇక ఎప్పుడు నిరాశ పరిచే ఢిల్లీ జట్టు ఈ ఏడాది అద్భుతంగా ఆడుతూ అందరిని ఆకర్షిస్తుంది. చూడాలి మరి ఈ ఆటను ఇలాగె చివరి వరకు కొనసాగించి ఐపీఎల్ టైటిల్ ఢిల్లీ అందుకుంటుందా అనేది.

Tags :
|
|

Advertisement