Advertisement

  • ఇంటి ముఖం పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్

ఇంటి ముఖం పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్

By: chandrasekar Mon, 09 Nov 2020 2:58 PM

ఇంటి ముఖం పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్


ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కు తట్టుకోలేక సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. ఐపీఎల్ 2020 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయానం ముగిసింది. టాస్ గెలిచి మొదట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 50 బంతుల్లో 78 పరుగులతో రఫ్పాడించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో వచ్చిన స్టోయినిస్ దూకుడుగా ఆడి 38 రన్స్ సాధించాడు. హెట్‌మెయిర్ కూడా 42 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ 21 పరుగులతో పరవా లేదనిపించాడు. ఢిల్లీకి ఓపెనర్లు ధావన్, స్టోయినిస్ శుభారంభం అందించారు. పవర్ ప్లేలో పరుగుల వరద పారించారు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లేలో ఏకంగా 65 రన్స్ పిండుకున్నారు. 9వ ఓవర్లో స్టోయినిస్ వికెట్ పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌తో కలిసి తన దూకుడును కొనసాగించాడు ధావన్. ఐతే 14వ ఓవర్లో శ్రేయస్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కు దిగిన హెట్‌మెయిర్ వస్తూనే హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దూకుడు ప్రదర్శించాడు.

స్కోర్ రన్ రేట్ పెరగడానికి సహాయ పడ్డాడు. హెట్‌మెయిర్ ఫోర్ల మోత మోగించాడు. 19వ ఓవర్లో ధావన్ ఔట్ కావడంతో ఆఖరులో స్కోర్ కాస్త తగ్గింది. లేదంటే 200లు దాటేది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇన్నింగ్స్ హైదరాబాద్ ఆరంభంలోనే తడబడింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. కేన్ విలియమ్సన్ పోరాడినా ఆఖరి వరకు ఉండకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు. అతడు 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 16 బంతుల్లో 33 రన్స్ చేశాడు. మనీష్ పాండే 21 పరుగులు సాధించాడు. ఐతే 17వ ఓవర్లో స్టోయినిస్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. విలియమ్సన్‌ను ఔట్ చేయడంతో హైదరాబాద్ టీమ్ కష్టాల్లో పడింది. తరువాత 19వ ఓవర్లో సమద్, రషీద్ ఖాన్, గోస్వామి మూడు వరుస బంతుల్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. పేలవమైన ఫీల్డింగ్ మరియు బాటింగ్ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు.

Tags :
|

Advertisement