Advertisement

  • పృథ్వీ షా ఆడిన షాట్ కు మంత్రముగ్దుడు అయిన రికీ పాంటింగ్

పృథ్వీ షా ఆడిన షాట్ కు మంత్రముగ్దుడు అయిన రికీ పాంటింగ్

By: Sankar Sun, 06 Sept 2020 2:39 PM

పృథ్వీ షా ఆడిన షాట్ కు మంత్రముగ్దుడు అయిన రికీ పాంటింగ్


పృథ్వీ షా ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో వినిపిస్తున్న అత్యంత ప్రతిభావంత యువ ఆటగాళ్లలో ఒకడు..ఇప్పటికే టెస్ట్ జట్టులో ఓపెనర్ గా రాణిస్తున్న షా , టి ట్వంటీ , వన్ డే జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు..ప్రస్తుతం యూఏఈ లో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీయల్ కోసం కఠోర సాధన చేస్తున్నాడు..

పృథ్వీ షా శ‌నివారం నెట్స్‌లో జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వ‌ర్యంలో క‌ఠోర సాధ‌న చేశాడు. ప్రాక్టీస్ చేస్తున్నంత సేపు మంచి ఫుట్‌వ‌ర్క్ కొన‌సాగిస్తూ బారీ షాట్ల‌ను ఆడాడు.పృథ్వీ షా ప్రాక్టీస్‌ను ద‌గ్గ‌ర్నుంచి గ‌మ‌నించిన పాంటింగ్ అత‌న్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు.

పృథ్వీ షా ప్ర‌తిభ అమోఘం. అత‌ని ఫుట్‌వ‌ర్క్ అద్భుతంగా ఉంది. పేస‌ర్ల‌ను టార్గెట్ చేస్తూ అతను కొడుతున్న ప్ర‌తీ షాట్‌లో మంచి టైమింగ్ క‌నిపిస్తుంది. ఈ సంద‌ర్భంగా పృథ్వీ ఆడిన ఒక షాట్‌ను.. 'నిజంగా అద్భుత‌మైన షాట్ ఆడావు .. వాట్ ఏ బ్యూటీ' అంటూ కామెంట్ చేశాడు. ఈ విష‌యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ త‌న ట్విట‌ర్‌లో షేర్ చేసుకుంది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌గా పేరు మార్చుకున్న త‌ర్వాత 2019లో ఆ జ‌ట్టు ఏడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్లేఆఫ్‌లో ఆడ‌డం విశేషం. శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలో స‌మ‌తూకంతో ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు పాంటింగ్ ప్ర‌ధాన కోచ్‌గా ఈ సీజ‌న్‌లో ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుందో చూడాలి


Tags :
|

Advertisement