Advertisement

  • ఐపీయల్ చరిత్రలో అత్యంత ఫాస్టెస్ట్ బంతిని సంధించిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్

ఐపీయల్ చరిత్రలో అత్యంత ఫాస్టెస్ట్ బంతిని సంధించిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్

By: Sankar Thu, 15 Oct 2020 3:05 PM

ఐపీయల్ చరిత్రలో అత్యంత ఫాస్టెస్ట్ బంతిని సంధించిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బాల్ విసిరాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్. నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నార్ట్జే 156.22 కిలోమీటర్ల వేగంతో రాయల్స్ బాట్స్మెన్ బట్లర్ కు బౌలింగ్ చేసాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో రెండో ఓవర్లలో నార్ట్జే ఈ ఘనత సాధించాడు. అంతకముందువరకు ఈ రికార్డును దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ పేరిట ఉంది. అతను ఐపీఎల్ లో 154.40 వేగంతో బౌలింగ్ చేసాడు. ఈ లీగ్ ప్రారంభాన్ని ముందు ఢిల్లీ జట్టు నుండి ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ తప్పుకోవడంతో అతని స్థానంలో నార్ట్జే జట్టులోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో నార్ట్జే 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 33 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇక ఈ ఐపీయల్ 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది..ఇప్పటికే ఎనిమిది మ్యాచ్ లలో ఆరు విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది ..ఇక అయిదు విజయాలతో ముంబై ఇండియన్స్ రెండవ స్థానంలో ఉంది

Tags :
|

Advertisement