Advertisement

ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన మార్కస్ స్టయినిస్..

By: Sankar Mon, 21 Sept 2020 11:09 AM

ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన మార్కస్ స్టయినిస్..


ఐపీయల్ 13 సీజన్ రెండవ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ మార్కస్ స్టయినిస్ తన ఆల్ రౌండ్ ఆటతీరుతో తొలి విజయాన్ని అందించి పాయింట్ల పట్టికలో బోణి కొట్టించాడు..తొలుత బాటింగ్ లో చెలరేగిన స్టయినిస్ , తర్వాత బౌలింగ్ లో కీలక చివర ఓవర్ వేసి మ్యాచ్ టై అయ్యేలా చేసాడు..

తొలుత టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అనుకున్న విధంగానే ఢిల్లీ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేసిన పంజాబ్ జట్టుకు చివర్లో మార్కస్ స్టోయినిస్ షాక్ ఇచ్చాడు. క్రిస్ జోర్డాన్ వేసిన చివరి ఓవర్లో మాత్రం స్టోయినిస్ రెండు సిక్స్లు మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. దాంతో కేవలం 21 బంతుల్లోనే 53 పరుగులు చేసాడు. అసలు మొదట కనీసం ఢిల్లీ 100 పరుగులైన చేస్తుందా అనే అనుమానం ఉన్న సమయంలో వచ్చిన స్టోయినిస్ రెచ్చిపోవడంతో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోర్డాన్ వేసిన చివరి ఓవర్లో 30 పరుగులు వచ్చాయి ..ఇలా ఐపీఎల్ చివరి ఓవర్లో 30 పరుగులు రావడం ఇదే తొలిసారి..

ఇక బౌలింగ్ తో కూడా చివరి ఓవర్లో అద్భుతంగా ఆడుతున్న మయాంక్ అగర్వాల్ ను బోల్తా కొట్టించడమే కాకుండా , చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన దశలో జోర్డాన్ వికెట్ తీసి మ్యాచ్ ను టై చేసాడు..ఇక సూపర్ ఓవర్లో రబడా అద్భుతంగా బౌలింగ్ వేసి ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు..ఇలా ఆడిన తొలి మ్యాచ్ లోనే తన 4.8 కోట్ల బారి విలువకు స్టయినిస్ న్యాయం చేసాడు..

Tags :

Advertisement