Advertisement

  • Flash News: డిగ్రీ విద్యార్ధులకు నెలకు రూ.5,000...ఇక్కడ అప్లై చెయ్యండి..!

Flash News: డిగ్రీ విద్యార్ధులకు నెలకు రూ.5,000...ఇక్కడ అప్లై చెయ్యండి..!

By: Anji Mon, 05 Oct 2020 10:42 AM

Flash News: డిగ్రీ విద్యార్ధులకు నెలకు రూ.5,000...ఇక్కడ అప్లై చెయ్యండి..!

డిగ్రీ విద్యార్ధులకు నెలకు రూ.5,000 లు ఫెలోషిప్ పొందే అద్భుతమైన అవకాశం బెంగళూరు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన కేవీపివై అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తరపున ఈ ఫెలోషిప్స్ లభిస్తాయి. ఆసక్తి గల విద్యార్థులు http:jvpy.iisc.ernet.in/ వె‌బ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లైకి ఆఖరుతేదీ అక్టోబర్ 19. మొదట అక్టోబర్ 5 ఆఖరు గడువు అని ప్రకటించారు. కానీ మరింత మంది విద్యార్థులకు అవకాశం ఇచ్చేందుకు వీలుగా గడువును పెంచారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ టెస్ట్ 2021 జనవరి 31న ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో జరుగుతుంది. అర్హత: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్‌తో పాటు ఎంఎస్సీ, ఎంఎస్ లాంటి కోర్సులు మొదటి సంవత్సరం చదువుతున్నవారు అప్లై చేసుకోవచ్చు. టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫెలోషిప్ ఎంపిక జరుగుతుంది.

degree students to get a fellowship of rs. 5,000 per month,bangalore kishore scientific promotion scheme,kvpy scheme,fellowship of rs. 5,000,department of science and technology,central government,examination centers,hyderabad,karimnagar,warangal in telangana,andhra pradesh,kurnool,rajahmundry,tirupati,vijayawada and visakhapatnam,kvpy 2020 registration,kvpy 2020 fellowship online registration

డిగ్రీ విద్యార్థులకు రూ.5,000, మాస్టర్స్ విద్యార్థులకు రూ.7,000 చొప్పున ఫెలోషిప్‌తో పాటు ఏడిదికి ఒకసారి కంటింజెన్సీ గ్రాంట్ లభిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు చేసేవారికి ఈ ఫెలోషిప్స్ లభిస్తాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్ట్స్‌తో డిగ్రీ, మాస్టర్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1250. ఎస్సీ, ఎస్టీ. దివ్యాంగులకు రూ.625. రోజుకు 40 కిలోమీటర్లు నడిచి.. డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.5,000 చొప్పున మూడేళ్లు, పీజీ విద్యార్థులకు నెలకు రూ.7,000 చొప్పున రెండేళ్లు ఫెలోషిప్ లభిస్తుంది.

దీంతో పాటు ఏడాదికోసారి డిగ్రీ విద్యార్థులకు రూ.20,000, పీజీ విద్యార్థులకు రూ.28,000 కంటింజెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. విద్యార్థులు తమ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తు ఈhttp://kvpy.iisc.ernet.in/ వెబ్‌సైట్‌లో చేయాలి.

Tags :
|

Advertisement