Advertisement

  • డిగ్రీ ఫైనలియర్‌ కళాశాలలు ప్రారంభం...డిసెంబర్‌ 7 నుంచి

డిగ్రీ ఫైనలియర్‌ కళాశాలలు ప్రారంభం...డిసెంబర్‌ 7 నుంచి

By: chandrasekar Tue, 01 Dec 2020 5:49 PM

డిగ్రీ ఫైనలియర్‌ కళాశాలలు ప్రారంభం...డిసెంబర్‌ 7 నుంచి


తమిళనాడు సీఎం పళనిస్వామి డిసెంబర్‌ 7వ తేదీ నుంచి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్థుల కోసం కళాశాలలను ప్రారంభించనున్నట్లు సోమవారం పేర్కొన్నారు. ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మత్స్య, పశువైద్య, వ్యవసాయం, హాస్టళ్లతో సహా అన్ని కళాశాలలు, యూనివర్సిటీలు, పారామెడికల్‌ కోర్సులు ఇవ్వనున్నట్లు చెప్పారు.

ప్రస్తుత 2020-21 విద్యా సంవత్సరంలో చేరే కొత్తగా చేరే విద్యార్థులకు తరగతులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు. అలాగే ఆడిటోరియంలో సామాజిక, రాజకీయ, వినోద కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మెరీనా బీచ్‌తో సహా పలు పర్యాటక ప్రదేశాలు తెరవనున్నట్లు తెలిపారు. శిక్షణ ప్రయోజనాల కోసం స్విమ్మింగ్‌ ఫూల్స్‌కు వచ్చే నెల ఒకటి నుంచి సడలింపులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆడిటోరియాల్లో జరిగే కార్యక్రమాలకు పాల్గొనేవారి సంఖ్య గరిష్టంగా 200 మందికి, లేదంటే సీటింగ్‌ సామర్థ్యంలో 50శాతానికి పరిమితం కావాలని తెలియ చేశారు. ఇండోర్‌ ఫంక్షన్లకు చెన్నైలోని పోలీస్‌ కమిషనర్‌, మిగతా ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ల నుంచి అనుమతి పొందాలని తెలిపారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, డీఎంకే ర్యాలీలు చేపట్టడానికి పదేపదే ప్రయత్నిస్తున్న తరుణంలో, రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తికి అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో సంఘటనలను అనుమతించే నిర్ణయం తీసుకుంటామని పళనిస్వామి పేర్కొన్నారు. 2021 ఏప్రిల్-మే నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రజలు మాస్క్‌లు ధరించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు.

Tags :
|
|

Advertisement