Advertisement

  • రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నానన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్

రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నానన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్

By: chandrasekar Fri, 27 Nov 2020 10:16 PM

రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నానన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్


ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నానని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసేందుకు ఇటీవల రూపొందించిన చట్టాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. నిరసన తెలిపే రైతులతో అన్ని అసాధారణ సమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. హెచ్‌టీ లీడర్‌షిప్‌ సమ్మిట్‌-2020లో ఆయన మాట్లాడుతూ ‘దేశంలోని రైతులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నా. వారు ఆందోళనను అంతం చేయాలి వారిని చర్చలకు ఆహ్వానిస్తున్నాను. నేను రక్షణ మంత్రిని అయినా రైతు కొడుకుగా చర్చలకు పిలుస్తున్నా. మేం ఎప్పుడూ రైతులను మోసం చేయలేం అని అన్నారు. ఇటీవల తీసుకువచ్చిన బిల్లులు అధిక వ్యవసాయ ఆదాయానికి దారి తీస్తాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

కేంద్రం తీసుకు వచ్చిన ఈ చట్టాలవల్ల ఒక రైతు కొడుకుగా రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఫలితాలు కనిపిస్తాయని నేను చెప్పగలనన్నారు. రైతుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది అని స్పష్టం చేశారు. చట్టాల రైతుల ప్రయోజనాలకు ఏ విధంగా హాని కలిగించవని రక్షణమంత్రి పేర్కొన్నారు. ‘నేను ఈ విషయాన్ని విశ్వాసంతో చెప్పగలను. ఎందుకంటే బిల్లుల ప్రతి నిబంధనను నేను చదివాను. మండి అంతం కాదు కొనసాగుతుందని’ చెప్పారు. ‘కనీస మద్దతు ధరలకు ధాన్యాలు కొనుగోలు కొనసాగుతూనే ఉందని భవిష్యత్‌లో కూడా కొనసాగుతుందన్నారు. వాస్తవానికి ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ పరిణామంలో కొనుగోలు చేస్తుందని రక్షణమంత్రి ప్రకటించారు. దీనివల్ల రైతులు చర్చలకు రావాలని కోరారు.

Tags :

Advertisement