Advertisement

  • ధోనికి ఆ బంతులు వేస్తే కట్టడి చేయొచ్చు ..దీపక్ చాహర్

ధోనికి ఆ బంతులు వేస్తే కట్టడి చేయొచ్చు ..దీపక్ చాహర్

By: Sankar Mon, 08 June 2020 6:26 PM

ధోనికి ఆ బంతులు వేస్తే కట్టడి చేయొచ్చు ..దీపక్ చాహర్

మహేంద్ర సింగ్ ధోని ..ఈ పేరు గురించి క్రికెట్ ప్రపంచం లో ఏ మాత్రం పరిచయం అక్కర్లేదు ..కీపర్ గా , బాట్స్మన్ గా , కెప్టెన్ గా ఇలా తాను ఏ రోల్ తీసుకున్న దానిని సమర్ధవంతంగా పోషించి అల్ టైం గ్రేట్ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు ..మ్యాచ్లను ముగించడంలో ధోనిని మించిన ఆటగాడు ప్రపంచ క్రికెట్లోనే లేడు..డెత్ ఓవర్లలో ధోనికి బౌలింగ్ వేయాలంటే బౌలర్లు జంకుతారు...

dhoni,deepak chahar,csk,death overs,yorker ,ధోని, దీపక్ చాహర్ , డెత్ ఓవర్లలో, బౌలర్లు ,  కెప్టెన్



అయితే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో చెన్నైసూపర్ కింగ్స్ బౌలర్ చాహర్ మాట్లాడుతుండగా.. ధోనీ కట్టడికి మీరైతే ఎలాంటి బంతిని డెత్ ఓవర్లలో సంధిస్తావు..? అని ఓ అభిమాని అడిగాడు. దాంతో.. నాలుగు రోజుల ముందు అదే ప్రశ్నని ధోనీ ముందుంచినట్లు చాహర్ తాజాగా వెల్లడించాడు. ‘‘ధోనీని నేను ఆ ప్రశ్న అడగ్గానే.. నకుల్ బాల్ మంచి ఆప్షన్ అని సమాధానమిచ్చాడు. కానీ.. ఆ బంతిని నేను విసిరితే నువ్వు సులువుగా స్టేడియంలోకి సిక్స్‌గా కొట్టేస్తావ్..! అని నవ్వేశా’ అని చాహర్ వెల్లడించాడు.
డెత్ ఓవర్లలో ధోనీ ఓ వ్యూహం ప్రకారం హిట్టింగ్ చేస్తాడని చెప్పుకొచ్చిన చాహర్.. అతడ్ని కట్టడి చేయాలంటే వైడ్ యార్కర్ లేదా వైడ్ స్లోయర్ బౌన్సర్ బెస్ట్ ఆప్షన్ అని వివరించాడు. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Tags :
|
|

Advertisement