Advertisement

దేశంలో తగ్గుతున్న కరోనా మరణాల రేటు

By: chandrasekar Wed, 05 Aug 2020 8:48 PM

దేశంలో తగ్గుతున్న కరోనా  మరణాల రేటు


భారతదేశంలో రోజురోజుకూ విస్తృతరూపం దాలుస్తున్న కరోనా వైరస్ పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఊరట కల్గించే విషయాలు వెల్లడయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి ముఖ్యంగా మరణాల రేటు, రికవరీ రేటు విషయంలో మెరుగ్గా ఉందని ప్రకటించింది. కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నా సరే మరణాల రేటు, రికవరీ రేటులో మాత్రం ఇండియా మిగిలిన దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది.

పెద్దసంఖ్యలో రోగులు కోలుకుంటున్నారని..రికవరీ రేటు 66.31 శాతానికి పెరిగిందని ఆయన చెప్పారు. ప్రతి పది లక్షల మందిలో 15 వేల మందికి చొప్పున ఇప్పటివరకూ దేశంలో 2 కోట్లకు పైగా పరీక్షలు జరిగాయన్నారు. గత 24 గంటల్లో 6 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి దేశంలో. గత 24 గంటల్లో దేశంలో 52 వేల 50 కొత్త కేసులు నమోదు కాగా..803 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 18 లక్షల 50 వేలు పై చిలుకు కేసులు ఇప్పటివరకూ నమోదు కాగా...గత 24 గంటల్లో 44 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags :
|
|

Advertisement