Advertisement

గోదావరిలో తగ్గిన ఉదృతి

By: chandrasekar Wed, 19 Aug 2020 4:04 PM

గోదావరిలో తగ్గిన ఉదృతి


కరోనా ప్రమాదం ఒక పక్క ఉంటే మరో పక్క ఏమో వరద ఉదృతి ప్రజలని భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగిన గోదావరి మంగళవారం శాంతించింది. మంగళవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద వరద 51.2 అడుగులకు చేరడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు 57.10 అడుగులున్న గోదావరి మధ్యాహ్నం 2 గంటలకు 53.20 అడుగులకు, సాయంత్రం 4 గంటల సమయానికి 52.80 అడుగులకు చేరింది. నీటి ప్రవాహం తగ్గడం ద్వారా ప్రమాద హెచ్చరికలు జారీ నిలుపుదల చేయవచ్చు.

నీటి ప్రవాహం 53 అడుగుల కంటే తక్కువ ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఇది మరింత తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కానీ ప్రవాహం తగ్గినప్పటికీ చాలా ఊర్లలో జల దిగ్బంధం ఇంకా కొనసాగుతుంది. గోదావరి వరద ఉద్ధృతి తగ్గినా భద్రాచలం ఏజెన్సీలోని పలు మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

ఊర్లలో ప్రధాన రహదారులపైకి వరద చేరుకోవడంతో నాలుగు రోజులుగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రాలోని ముంపు మండలాలు కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాల్లోని పలు గ్రామాలు సైతం జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీ రాష్ర్టాలకు రాకపోకలకు వీలు లేకుండాపోయింది. ఇందువల్ల ప్రజలు చాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు కూడా వరద ఉద్ధృతి తగ్గిందని తెలిపారు.

Tags :
|

Advertisement