Advertisement

  • తెలంగాణలో తగ్గిన కరోనా ఉదృతి.. 24 గంటల్లో 384 పాజిటివ్‌ కేసులు..

తెలంగాణలో తగ్గిన కరోనా ఉదృతి.. 24 గంటల్లో 384 పాజిటివ్‌ కేసులు..

By: chandrasekar Mon, 14 Dec 2020 3:50 PM

తెలంగాణలో తగ్గిన కరోనా ఉదృతి.. 24 గంటల్లో 384 పాజిటివ్‌ కేసులు..


మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గింది. కరోనా ఉదృతి గత కొంత కాలంగా దేశంలోనూ అటు మన తెలంగాణా రాష్ట్రంలోనూ భారీగా తగ్గింది. ఇక్కడ నిర్వహించబడ్డ కరోనా పరీక్షల్లో గడిచిన 24 గంటల్లో 384 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనా బులిటెన్‌ విడుదల చేసింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో 2,78,108 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మరియు తాజాగా కరోనాతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య 1,496కి చేరిందని తెలిపారు.

కరోనాబారి నుంచి నిన్న 631 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న బాధితుల సంఖ్య 2,69,232కి చేరిందని వివరించారు. ఇవికాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం మరో 7,380 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,298 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వివరాలు అందించారు.

ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 61,64,661కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ పరిధిలో కొత్తగా 101 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 28,980 మందికి కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ వివరాలు గతంతో పోల్చుకుంటే చాలావరకు తగ్గినట్లు తెలిపారు.

Tags :
|

Advertisement