Advertisement

  • మ్యాన్‌పవర్‌ గ్రూపు ఎంప్లాయిమెంట్‌ సర్వే లో తగ్గనున్న ఉద్యోగ అవకాశాలు

మ్యాన్‌పవర్‌ గ్రూపు ఎంప్లాయిమెంట్‌ సర్వే లో తగ్గనున్న ఉద్యోగ అవకాశాలు

By: chandrasekar Wed, 10 June 2020 7:03 PM

మ్యాన్‌పవర్‌ గ్రూపు ఎంప్లాయిమెంట్‌ సర్వే లో తగ్గనున్న ఉద్యోగ అవకాశాలు


మ్యాన్‌పవర్‌ గ్రూపు ఎంప్లాయిమెంట్‌ సర్వే లో ఉద్యగావకాశాలు చాల తక్కువగా ఉంటుందని తేలింది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత కూడా కొత్త ఉద్యోగాల కల్పనకు కార్పొరేట్‌ కంపెనీలు ఆసక్తిగా లేవని ఓ కీలక సర్వేలో వెల్లడయ్యింది. వచ్చే మూడు నెలల కాలంలో కేవలం 5 శాతం కంపెనీలు మాత్రమే కొత్త అవకాశాలు కల్పించడానికి సిద్దంగా ఉన్నాయని మ్యాన్‌పవర్‌ గ్రూపు ఎంప్లాయిమెంట్‌ సర్వేలో వెల్లడయ్యింది.

ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న 695 సంస్థలను సర్వేలో భాగస్వాములను చేసింది. కాగా, జులై, సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికర ఉద్యోగుల పెంపునకు 5 శాతం కంపెనీలు మాత్రమే ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ సంస్థ సర్వే ప్రారంభించిన 15 సంవత్సరాల్లో ఇవే అత్యంత బలహీన గణంకాలు కావడం గమనార్హం. ఆర్ధిక మందగమనం నేపథ్యంలో కార్పొరేట్‌ కంపెనీలు తమ సిబ్బందిని హేతుబద్దీకరిస్తున్నాయని మ్యాన్‌ పవర్‌ గ్రూపు ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ గులాటి పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో వేచి చూసే దోరణీతో ఉన్నాయన్నారు. ఉపాధి కల్పనకు గనులు, నిర్మాణం, ఫైనాన్స్‌, బీమా, రియల్‌ ఎస్టేట్‌లో కొంత సానుకూలంగా ఉన్నాయని తెలియజేసారు.

Tags :

Advertisement