Advertisement

  • అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గొచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గొచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

By: chandrasekar Fri, 16 Oct 2020 2:31 PM

అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గొచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు


అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గింది. దీని ప్రభావం మాత్రం దేశంలో కనిపించడం లేదు. ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అన్ని చోట్ల స్థిరంగానే వున్నాయి. దేశీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.84.25 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.76.84 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.87.16 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.79.34 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.86.73 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.78.93 వద్ద నిలకడగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర స్థిరంగానే ఉంది. రూ.81.06 వద్ద నిలకడగా కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.70.46 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.87.74 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.76.86 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.83 శాతం తగ్గుదలతో 42.83 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.73 శాతం క్షీణతతో 40.65 డాలర్లకు చేరింది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. పన్నులు తగ్గిస్తే తప్ప ధరలు తగ్గక పోవచ్చు.

Tags :
|

Advertisement