Advertisement

  • ఆఫ్రికాలో దేశం అయిన బోత్సువానాలో అనుమానాస్పదంగా 350 ఏనుగుల మరణం

ఆఫ్రికాలో దేశం అయిన బోత్సువానాలో అనుమానాస్పదంగా 350 ఏనుగుల మరణం

By: chandrasekar Fri, 03 July 2020 10:53 AM

ఆఫ్రికాలో దేశం అయిన బోత్సువానాలో అనుమానాస్పదంగా 350 ఏనుగుల మరణం


ఆఫ్రికా దేశంలోని బోత్సువానాలో అనుమానాస్పదంగా 350 ఏనుగులు మరణించాయి. వాటి మరణం వెనక అసలు కారణం ఏంటో కనుక్కోవడానికి వన్యప్రాణి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. బోత్సువానాలో గత రెండు నెలలుగా సుమారు 350 ఏనుగులు మరణించాయి.

ఈ విషయం తెలుసుకున్న వన్య ప్రాణి ప్రేమికులు దిగులు పడుతున్నారు. వాటి మరణం వెనక అసలు కారణం ఏంటో కనుక్కోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన బోత్సువానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ నేషనల్ పార్క్ అధికారులు వాటికి పరీక్షలు నిర్వహించారు.

అయితే కరోనా కల్లోలం మధ్య ఆ శాంపిల్స్ను ప్రపంచంలోని పలు దేశాల్లోని అత్యుత్తమ ల్యాబ్స్కు పంపించడానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో లాక్ డౌన్ మినహాయింపు ఉండటంతో ఆ దేశాలకు శాంపిల్స్ పంపించారు. అయితే శాంపిల్స్ను పరిశీలించి నివేదిక రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుంది అని తెలిసింది.

అప్పటి వరకు గజరాజులు మరణానికి గల అసలు కారణం ఏంటో అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోనుంది. ఆఫ్రికాలోను మొత్తం ఏనుగులు అన్నింటిలో మూడువ వంతు బోత్సువానాలోనే ఉన్నాయి. దాంతో వాటి మరణ వార్త ఆఫ్రికాను కుదిపేస్తోంది. ఏనుగులను వాటి దంతాల కోసం వేటగాళ్లు చంపిఉండే అవకాశం కూడా లేదు అని ఎందుకంటి వాటి దంతాలు మిస్ అవలేదు అని అధికారులు తెలిపారు. అయితే విషప్రయోగం జరిగిందా అనే కోణంలో నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.

Tags :
|

Advertisement