Advertisement

ఐస్‌క్రీం ఫ్రీజ‌ర్‌లో 48 గంట‌ల పాటు మృత‌దేహాం

By: chandrasekar Thu, 02 July 2020 8:36 PM

ఐస్‌క్రీం ఫ్రీజ‌ర్‌లో 48 గంట‌ల పాటు మృత‌దేహాం


కోల్‌క‌తాలో ఓ 71 ఏళ్ల వృద్ధుడి మృత‌దేహాన్ని ఐస్‌క్రీం ఫ్రీజ‌ర్‌లో రెండు రోజుల పాటు ఉంచారు. డాక్ట‌ర్లు మ‌ర‌ణ ద్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డంతో ఆ వృద్ధుడి ఫ్యామిలీ స‌భ్యులు ఐస్‌క్రీం ఫ్రీజ‌ర్‌లో అత‌ని శ‌వాన్ని దాచిపెట్టారు. సోమ‌వారం అస్వ‌స్థ‌త‌తో హాస్పిట‌ల్‌కు వెళ్లిన వృద్ధుడిని డాక్ట‌ర్లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌న్నారు. అయితే ఇంటికి వెళ్లిన అత‌ను సాయంత్రం చ‌నిపోయాడు. ఆ త‌ర్వాత ద‌హ‌నం కోసం ఆ వృద్ధుడి మృత‌దేహాన్ని మార్చురీకి తీసుకువెళ్తే డెత్ సర్టిఫికెట్ ఉంటేనే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు.

దీంతో ఫ్యామిలీ మెంబ‌ర్స్ డాక్ట‌ర్లు చుట్టూ తిరిగారు. ఈ ప్ర‌క్రియ ఆల‌స్యం అవుతుంద‌ని తెలుసుకుని ఐస్‌క్రీం ఫ్రీజ‌ర్ తీసుకు వ‌చ్చారు. రెండు రోజుల త‌ర్వాత ఆ వృద్ధుడికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో డెత్ స‌ర్టిఫికెట్ జారీ అయ్యింది. కానీ ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించేందుకు ఎవ‌రూ ముంద‌కు రాలేదు. దీంతో ఫ్యామిలీ మెంబ‌ర్స్ ప్ర‌భుత్వ స‌హాయాన్ని కోరారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ హెల్ప్ అడిగారు. చివ‌ర‌కు వాళ్లు స్పందించారు. కోల్‌క‌తా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఉద్యోగులు వ‌చ్చి ఫ్రీజ‌ర్‌లో ఉన్న వృద్ధుడి శ‌వాన్ని తీసుకువెళ్లారు. సుమారు 50 గంట‌ల త‌ర్వాత ఆ ఫ్యామిలీ ఉంటున్న బిల్డింగ్‌ను శానిటైజ్ చేశారు.

Tags :
|
|
|

Advertisement