Advertisement

  • దేశంలో మూడో దశ కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి

దేశంలో మూడో దశ కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి

By: Sankar Fri, 23 Oct 2020 09:35 AM

దేశంలో మూడో దశ కరోనా వాక్సిన్ క్లినికల్  ట్రయల్స్ కు అనుమతి


ఇండియాలో కరోనా వాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ డెవలప్ చేస్తున్న కోవాగ్జిన్ టీకా కీలక దశకు చేరుకుంది.

రెండు దశలను ఇప్పటికే కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో దశ ట్రయల్స్ కోసం అక్టోబర్ 2 వ తేదీన దరఖాస్తు చేసుకోగా, డిసిజీఐ అనుమతులు మంజూరు చేసింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 19 వేరు వేరు ప్రాంతాల్లో 18 ఏళ్లకు పైబడిన వారిపై మూడో దశ ట్రయల్స్ ను నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరింది. డిసిజీఐ అనుమతులు ఇవ్వడంతో త్వరలోనే ట్రయల్స్ ప్రారంభం కాబోతున్నాయి.

ఇక గుజరాత్ లోని జైడస్ క్యాడిలా ప్రస్తుతం రెండో దశ ట్రయల్స్ లో ఉన్నది. ఈ రెండు కూడా మంచి ఫలితాలు ఇస్తుండటంతో భారత్ వ్యాక్సిన్ పై ధీమా వ్యక్తం చేసింది. త్వరలోనే దేశంలో ఈ రెండు వ్యాక్సిన్ లు అందుబాటులోకి రాబోతున్నాయి. అలానే సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా, అస్త్రాజెనకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలు కలిసి సంయుక్తంగా తయారు చేస్తున్న టీకా రెండు, మూడు దశల్లో ట్రయల్స్ ను నిర్వహిస్తోంది.

Tags :
|

Advertisement