Advertisement

  • ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బౌలర్‌గా DC పేసర్ అన్రిచ్ నోర్జే రికార్డ్

ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బౌలర్‌గా DC పేసర్ అన్రిచ్ నోర్జే రికార్డ్

By: chandrasekar Thu, 15 Oct 2020 09:39 AM

ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బౌలర్‌గా DC పేసర్ అన్రిచ్ నోర్జే రికార్డ్


ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్రిచ్ నోర్జే ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అక్టోబర్ 14న దుబాయ్ వేదిక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సౌతాఫ్రికా పేసర్ గంటకు 156.22 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఆశ్చర్యపరిచాడు. గాయం కారణంగా దూరమైన క్రిస్ వోక్స్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వచ్చిన నోర్జే సహచర సౌతాఫ్రికా పేసర్ రబాడతో కలిసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతున్నాడు. ఈ సీజన్లో నోర్జే.. గంటకు 156 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్నాడు. మరో ఢిల్లీ పేసర్ రబాడ ఐపీఎల్‌లో 154 కిలోమీటర్లకుపైగా వేగంతో బంతులు విసురుతుండటం విశేషం. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ బౌలర్ల జాబితాలో ఇప్పటి వరకూ రబాడ, డేల్ స్టెయిన్, జోఫ్రా ఆర్చర్, ప్యాట్ కమిన్స్ ఉండగా తాజాగా నోర్జే వారందర్నీ దాటేశాడు.

ఈ సీజన్లో ఆర్చర్ కంటే వేగంగా బౌలింగ్ చేసే బౌలర్ ఎవరైనా ఉంటే బదులివ్వండని కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. నోర్జే గంటకు 156 కిలోమీటర్లకుపైగా వేగంతో బౌలింగ్ చేయగానే నోర్జేతో కలిసి ఏ ప్రొసీజర్ ప్రకారం రిప్లయ్ ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోల్ చేసింది. దక్షిణాఫ్రికా తరఫున ఆరు టెస్టులు, ఏడు వన్డేలు, 3 టీ20లు ఆడిన నోర్జేను 2019 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోనుగోలు చేసింది. గాయం కారణంగా నోర్జే గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ 2020లో వోక్స్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరిన నోర్జే.. ఐపీఎల్ చరిత్రలోనే వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చిన నోర్జే.. జోస్ బట్లర్, రాబిన్ ఉతప్పలను పెవిలియన్ చేర్చాడు. 18వ ఓవర్లో అద్భుతమైన బంతితో ఉతప్పను బౌల్డ్ చేసిన నోర్జే.. ఆ ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ పేసర్ 10 వికెట్లు తీసాడు.

Tags :

Advertisement