Advertisement

  • క్యాచ్‌లను పట్టలేకపోతే మ్యాచ్‌లను గెలవలేమన్న డేవిడ్ వార్నర్

క్యాచ్‌లను పట్టలేకపోతే మ్యాచ్‌లను గెలవలేమన్న డేవిడ్ వార్నర్

By: chandrasekar Mon, 09 Nov 2020 3:01 PM

క్యాచ్‌లను పట్టలేకపోతే మ్యాచ్‌లను గెలవలేమన్న డేవిడ్ వార్నర్


క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో ఓటమి చవి చూసిన హైదరాబాద్ కెప్టెన్ ఓటమికి కారణాలను వెల్లడించారు. క్యాచ్‌లను పట్టలేకపోతే మ్యాచ్‌లను గెలవలేమని డేవిడ్ వార్నర్ తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2020 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు అవకాశాల్ని దెబ్బతీశాయని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ పెదవి విరిచాడు. ఢిల్లీ జట్టుకి మెరుగైన స్కోరుని అందించిన శిఖర్ ధావన్ (78: 50 బంతుల్లో 6x4, 2x6), స్టాయినిస్ (38: 27 బంతుల్లో 5x4, 1x6), సిమ్రాన్ హిట్‌మెయర్ (42 నాటౌట్: 22 బంతుల్లో 4x4, 1x6) ఇచ్చిన క్యాచ్‌లను హైదరాబాద్ ఫీల్డర్లు జారవిడిచారు. దాంతో మరింత రెచ్చిపోయిన ఈ ముగ్గురూ ఢిల్లీ టీమ్‌కి 189 పరుగుల మెరుగైన స్కోరుని అందించారు. బౌండరీ లైన్స్ దూరంగా ఉండే అబుదాబిలో 190 పరుగుల ఛేదన అదీ క్వాలిఫయర్-2 లాంటి ఒత్తిడి మ్యాచ్‌లో హైదరాబాద్‌కి కష్టమైపోయింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్‌లో సిల్లీ మిడాన్ దిశగా స్టాయినిస్ బంతిని హిట్ చేశాడు. ఆ బంతి అనూహ్యంగా స్వింగ్ అవడంతో షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాకుండా బంతి ఫీల్డర్ జేసన్ హోల్డర్ పక్కగా గాల్లోకి లేచింది. కానీ ఆ బంతిని క్యాచ్‌గా అందుకోవడంలో అతను ఫెయిలైపోయాడు. అప్పటికి స్టాయినిస్ స్కోరు 3 మాత్రమే. దీనివల్ల అవకాశం కోల్పోయినట్లు అయింది.

దీంతో పుజుకొన్న స్టాయినిస్ తర్వాత ఓవర్ వేసిన హోల్డర్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాది మళ్లీ ఔటయ్యే వరకూ టాప్‌గేర్‌లోనే కొనసాగాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో సిమ్రాన్ హిట్‌మెయర్ బౌలర్ హోల్డర్ విసిరిన యార్కర్ బంతిని కవర్స్ దిశగా హిట్ చేశాడు. బంతి ఎక్కువగా గాల్లోకి లేవడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నదీమ్ సులువుగా క్యాచ్ అందుకునేలా కనిపించాడు. కానీ ఆ బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయిన నదీమ్ దాన్ని నేలపాలు చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో శిఖర్ ధావన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ని రషీద్ ఖాన్ ఆశ్చర్యకరరీతిలో జారవిడిచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ డీప్ మిడ్ వికెట్ దిశగా హిట్ చేయగా బంతి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ ఖాన్‌ చేతుల్లోకి నేరుగా వెళ్లింది. కానీ రషీద్ ఖాన్ ఆ క్యాచ్ ను వదిలేశాడు. సొలభంగా వున్నా ఈ క్యాచ్ వదిలేయడం ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ముంబయి ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి దుబాయ్ వేదికగా టైటిల్ పోరులో ఢిల్లీ తలపడనుంది. తమ జట్టు క్యాచ్‌లను పట్టలేకపోతే మ్యాచ్‌లను గెలవలేం. గాయాల కారణంగా భువీ, సాహాల సేవల్ని కోల్పోవడం టీమ్‌ని దెబ్బతీసింది అని మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. హైదరాబాద్ అటు బాటింగ్ లోను ఆశించిన రీతిలో రాణించలేదు.

Tags :
|

Advertisement