Advertisement

  • ఆ ఆటగాడిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము ...ఫాన్స్ కు డేవిడ్ వార్నర్ భరోసా

ఆ ఆటగాడిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము ...ఫాన్స్ కు డేవిడ్ వార్నర్ భరోసా

By: Sankar Sun, 15 Nov 2020 7:08 PM

ఆ ఆటగాడిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము ...ఫాన్స్ కు డేవిడ్ వార్నర్ భరోసా


వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో హైదరాబాద్ కేన్ విలియమ్సన్‌ను వదులుకుంటుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో హైదరాబాద్ ఫ్యాన్స్ ఒక్కింత కంగారుపడ్డారు. మిడిల్ ఆర్డర్‌లో జట్టుకు అండగా ఉంటున్న ‘కేన్ మామ’ ఎలా తీసేస్తారని.. మీ(వార్నర్) తర్వాత మా ఆశలన్నీ అతడిపైనేనని పేర్కొన్నారు. ఇక వీటిపై తాజాగా ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.

”హైదరాబాద్ జట్టు కేన్ విలియమ్సన్‌ను వదులుకోదు. నేను కూడా అతడు జట్టులో ఉండాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా న్యూజిలాండ్ కెప్టెన్‌ను తాము వదులుకునేది లేదని” వార్నర్ స్పష్టం చేశాడు. సామాజిక మాధ్యమాల్లో పలువురు నెటిజన్లు విలియమ్సన్‌పై అడిగిన ప్రశ్నలకు వార్నర్ ఈ విధంగా బదులిచ్చాడు.

కాగా, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. టోర్నీ అంతటా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి ట్రోఫీని ఎగరేసుకుని పోయింది. ఇక ఐపీఎల్ 2021 కోసం మెగా ఆక్షన్‌ను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరగనుంది.

Tags :
|

Advertisement