Advertisement

  • ఆర్చర్ కు సవాల్ విసిరిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్..

ఆర్చర్ కు సవాల్ విసిరిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్..

By: Sankar Sun, 20 Sept 2020 11:35 AM

ఆర్చర్ కు సవాల్ విసిరిన  సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్..


ఐపీయల్ లో అత్యంత విజయంతవమైన విదేశీ ఆటగాళ్లలో ముందుకి వరుసలో ఉండే ఆటగాడు హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్..గత కొన్ని ఏళ్లుగా ఐపీయల్ లో తన విధ్వంసక బ్యాటింగ్ తో అలరిస్తున్నాడు..అయితే ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో వార్నర్ అంతగా రాణించలేకపోయాడు..ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాత నేరుగా దుబాయ్‌లో అడుగుపెట్టిన వార్నర్‌ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.

'రెండేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా పనిచేయబోతున్నా. గత ఐదేళ్లుగా జట్టుతో పాటే కొనసాగుతున్నా కాబట్టి జట్టులోని ఆటగాళ్ల గురించి మాట్లాడేందుకు ఏం లేదు. కెప్టెన్‌గా నా విధులను సక్రమంగా నిర్వహిస్తూనే బ్యాట్స్‌మన్‌గా అన్నిఅస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నా. ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడికే చేరుకోవడం.. మంచి ప్రాక్టీస్‌ కూడా లభించడం జరిగింది.

ఇక మొదటి మ్యాచ్‌కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్‌లో ఐదు సార్లు ఔటయ్యాను. ఆర్చర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. మొదటి మ్యాచ్‌ ద్వారానే ఆర్చర్‌ను ఎదుర్కొనే అవకాశం లభించింది. ఆర్చర్‌ రెడీగా ఉండు తేల్చుకుందాం' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ మొదటి మ్యాచ్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో సెప్టెంబర్‌ 21న తలపడనుంది. డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్‌సన్‌, బెయిర్‌ స్టో, బిల్లీ స్టాన్‌లేక్‌, రషీద్‌ ఖాన్‌ వంటి విదేశీ ఆటగాళ్లు బలంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్‌ స్వదేశీ ఆటగాళ్లో ఒక్క భూవీ, పాండే తప్ప పెద్ద పేరున్న ఆటగాళ్లు లేకపోవడం పెద్ద లోటుగా చెప్పొచ్చు.

Tags :

Advertisement