Advertisement

  • యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ పై ప్రశంసల వర్షం కురిపించిన వార్నర్

యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ పై ప్రశంసల వర్షం కురిపించిన వార్నర్

By: Sankar Wed, 09 Dec 2020 7:42 PM

యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ పై ప్రశంసల వర్షం కురిపించిన వార్నర్


ఆస్ట్రేలియా తో జరిగిన టి ట్వంటీ సిరీస్ లో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రాణించిన నటరాజన్ మీద ప్రశంసల వర్షం కురుస్తుంధీ ...తాజాగా ఐపీయల్ లో నటరాజన్ కెప్టెన్ వార్నర్ కూడా ఈ యువ ఫాస్ట్ బౌలర్ మీద ప్రశంసలు కురిపించాడు..

నటరాజన్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన అతడు... ‘‘గెలిచినా, ఓడినా, డ్రా అయినా.. మైదానం వెలుపల మేం పరస్పరం గౌరవించుకుంటాం. ఈ సిరీస్‌ చేజారినందుకు బాధగానే ఉన్నా.. నటరాజన్‌ అద్భుత ప్రదర్శనను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా.

ఆటను తనెంతగానో ప్రేమిస్తాడు. నెట్‌ బౌలర్‌గా ఈ టూర్‌ ప్రారంభించి.. వన్డే, టీ20ల్లో ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. నువ్వు సాధించిన ఘనత అమోఘం’’ అని కితాబిచ్చాడు. అంతేగాక సన్‌రైజర్‌, ఆరెంజ్‌ఆర్మీ ట్యాగులను ఇందుకు జతచేశాడు.కాగా టీ20 సిరీస్‌లో 6.91 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీసి తనదైన ముద్ర వేశాడు.

Tags :
|

Advertisement