Advertisement

  • తొలి టెస్ట్ కు ముందు ఆసీస్ కు గట్టి ఎదురుదెబ్బ ...గాయం నుంచి ఇంకా కోలుకొని స్టార్ ఓపెనర్

తొలి టెస్ట్ కు ముందు ఆసీస్ కు గట్టి ఎదురుదెబ్బ ...గాయం నుంచి ఇంకా కోలుకొని స్టార్ ఓపెనర్

By: Sankar Wed, 09 Dec 2020 4:14 PM

తొలి టెస్ట్ కు ముందు ఆసీస్ కు గట్టి ఎదురుదెబ్బ ...గాయం నుంచి ఇంకా కోలుకొని స్టార్ ఓపెనర్


టీమిండియా , ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటికే వన్ డే సిరీస్ , టి ట్వంటీ సిరీస్ ముగిసాయి ..ఇందులో వన్ డే సిరీస్ ఆస్ట్రేలియా గెలిస్తే , టి ట్వంటీ సిరీస్ టీమిండియా గెలిచుకొని ప్రతీకారం తీర్చుకుంది..ఇక అసలైన టెస్ట్ సిరీస్ కోసం రెండు జట్లు తీవ్రంగా కృషి చేస్తున్నాయి...ఈ నెల పదిహేడు నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది..

కాగా తొలి టెస్ట్ కు ముందు ఆస్ట్రేలియా కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది..గాయంతో టి ట్వంటీ సిరీస్ కు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ ఓపెనర్ వార్నర్ తొలి టెస్ట్ కు కూడా దూరం కానున్నాడు...ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

ఇక అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది. అయితే, పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో పది రోజుల సమయం పడుతుందని వార్నర్‌ తెలిపాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు ఈ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ చెప్పాడు.

Tags :
|

Advertisement