Advertisement

  • ఆ ఆటగాడు 100 శాతం ఫిట్ గా లేకున్నా ఆడుతాడు ...ఆసీస్ అసిస్టెంట్ కోచ్

ఆ ఆటగాడు 100 శాతం ఫిట్ గా లేకున్నా ఆడుతాడు ...ఆసీస్ అసిస్టెంట్ కోచ్

By: Sankar Thu, 31 Dec 2020 7:14 PM

ఆ ఆటగాడు 100 శాతం ఫిట్ గా లేకున్నా ఆడుతాడు ...ఆసీస్ అసిస్టెంట్ కోచ్


టీమిండియాతో జరగనున్న మూడో టెస్టులో డేవిడ్‌ వార్నర్‌ 100శాతం ఫిట్‌గా లేకున్నా మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని ఆసీస్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అండ్రూ మెక్‌డొనాల్డ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే మెక్‌డొనాల్డ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వార్నర్‌ ఫిట్‌నెస్‌పై పలు సందేహాలకు తావిస్తుంది. మొదటి రెండు టెస్టులు చూసుకుంటే ఆసీస్‌ ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా శతకం సాధించలేకపోయారు...

వార్నర్‌ రాకతో జట్టు బలోపేతం అవడం నిజమే అయినా.. ఒక ఆటగాడు ఫిట్‌గా లేకున్నా ఎలా ఆడిస్తారనే దానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే వార్నర్‌తో పాటు తుది జట్టులోకి రానున్న పుకోవిస్కీ, సీన్‌ అబాట్‌ల ఫిట్‌నెస్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా భారత్‌తో జరిగిన రెండో వన్డే తర్వాత గజ్జల్లో గాయంతో వార్నర్‌ మూడో వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. వార్నర్‌ నాలుగు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని అంతా భావించినా.. గాయం తగ్గకపోవడంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మూడు, నాలుగు టెస్టులకు గానూ జో బర్న్స్‌ స్థానంలో వార్నర్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే..

Tags :

Advertisement