Advertisement

  • ఇంస్టాగ్రామ్ లో ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ సంపాదించిన వార్నర్

ఇంస్టాగ్రామ్ లో ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ సంపాదించిన వార్నర్

By: Sankar Mon, 14 Dec 2020 10:13 PM

ఇంస్టాగ్రామ్ లో ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ సంపాదించిన వార్నర్


ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కరోనా టైం లో తన డాన్స్ విన్యాసాలతో ఇండియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు..ముఖ్యంగా బుట్టబొమ్మ , మైండ్ బ్లాక్ సాంగ్స్ తో దేశ వ్యాప్తంగా వార్నర్ కు ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది...

అయితే వార్నర్‌తో పాటు అతడి భార్యా, పిల్లలు కూడా పలు తమిళ, హిందీ సాంగ్స్‌కు స్టెప్పులేస్తూ అలరించారు. వార్నర్‌ కుటుంబానికి ఫిదా అయిన భారతీయ నెటిజన్లు లైకులు, షేర్లతో వారిని ఉత్సాహపరిచారు. ఇక డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఓ ఇండియన్‌ నెటిజన్‌.. ‘తెరి’ సినిమా(తమిళ) బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించాడు.

ఇందుకు స్పందనగా.. ‘‘నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి సదా రుణపడి ఉంటాను. మీ కామెంట్లు, ఫీడ్‌బ్యాక్‌ నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఎల్లప్పుడూ నేనిలాగే మీ ముఖాలపై చిరునవ్వులు చిందేలా నా వంతు కృషి చేస్తా. ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు హర్షద్‌ గైక్వాడ్‌’’ అంటూ వార్నర్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

Tags :

Advertisement