Advertisement

  • ఐపీయల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన డేవిడ్ వార్నర్

ఐపీయల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన డేవిడ్ వార్నర్

By: Sankar Wed, 04 Nov 2020 7:44 PM

ఐపీయల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన డేవిడ్ వార్నర్


సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో కొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా ఐపీఎల్ ఆరు సీజన్లలో 500 పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా వార్నర్ నిలిచాడు.

ఐపీఎల్ 2020 లో నిన్న ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో వార్నర్ 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ లో 529 పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ఇక 2019 సీజన్లో 692 పరుగులు చేసిన వార్నర్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కానీ బాల్ ట్యాంపరింగ్ వివాదం లో చిక్కుకొని 2018 ఐపీఎల్ కు వార్నర్ దూరం అయ్యాడు. అయితే అంతకముందు వార్నర్ 2017 లో 641 పరుగులు, 2016 లో 848, 2015 లో 562, 2014 లో 528 పరుగులు చేశాడు. మొత్తం 140 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వార్నర్ 5,235 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 52 అర్థసెంచరీలు కూడా ఉన్నాయి.

Tags :

Advertisement