Advertisement

  • ఆ ఒక్క ఓవర్ వల్లనే మేము ఓడిపోయాము ..డేవిడ్ వార్నర్

ఆ ఒక్క ఓవర్ వల్లనే మేము ఓడిపోయాము ..డేవిడ్ వార్నర్

By: Sankar Tue, 22 Sept 2020 3:41 PM

ఆ ఒక్క ఓవర్ వల్లనే మేము ఓడిపోయాము ..డేవిడ్ వార్నర్


నిన్న రాయల్ ఛాలెంజెర్ బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో చివరి వరకు గెలుస్తుంది అనుకున్న సన్ రైజర్స్ జట్టు అనూహ్యంగా ఓటమిపాలయింది..చివర్లో వరుసగా వికెట్లు పడటంతో విజయానికి పది పరుగుల దూరంలో నిలిచింది.. ఇకపోతే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాళ్లు విచిత్ర రీతిలో అవుట్ అయ్యారు..ఇదే విషయంపై సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ గతంలో తాను ఎన్నడూ చూడని నాలుగు ఘటనలు ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్నాయని వార్నర్ చెప్పుకొచ్చాడు.


యాంకిల్ ఇంజ్యూరీతో ఇబ్బంది పడిన మిచెల్ మార్ష్.. బ్యాటింగ్‌కు దిగేందుకు తెగువ ప్రదర్శించాడని వార్నర్ కొనియాడాడు. పాదం మీద బరువు మోపలేకపోయినా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చాడన్నాడు. మార్ష్‌కు నొప్పి ఎక్కువగా ఉందని.. త్వరలోనే కోలుకుంటాడని వార్నర్ చెప్పాడు. వికెట్ల మధ్య పరిగెత్తటప్పుడు రషీద్ ఖాన్‌తో ఢీకొట్టిన అభిషేక్ శర్మ అనూహ్య రీతిలో రనౌట్ కావడం.. ప్రియమ్ గార్గ్ ర్యాంప్ షాట్‌కు యత్నించగా.. బంతి హెల్మెట్‌కు తగిలి వికెట్లకు తాకడం పట్ల వార్నర్ విస్మయం వ్యక్తం చేశాడు.

చివర్లో బెంగళూరు బౌలర్లపై ఎదురు దాడికి దిగాలని తమకు తెలుసన్న వార్నర్.. చాహల్ చివరి ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందన్నాడు. ఈ రోజు జరిగిన తప్పిదాలను తర్వాతి మ్యాచ్‌ల్లో పునరావృత్తం కాకుండా చూస్తామన్నారు. భారత్ యువ ఆటగాళ్లను తయారు చేస్తున్న తీరు అద్భుతంగా ఉందంటూ ఈ మ్యాచ్‌లో పడిక్కల్ రాణించిన విషయాన్ని వార్నర్ ప్రస్తావించాడు.

Tags :
|
|
|

Advertisement