Advertisement

  • బాలీవుడ్ కు కొత్త డాన్ వచ్చాడు ..అతడే డేవిడ్ వార్నర్ ఖాన్

బాలీవుడ్ కు కొత్త డాన్ వచ్చాడు ..అతడే డేవిడ్ వార్నర్ ఖాన్

By: Sankar Wed, 23 Dec 2020 5:21 PM

బాలీవుడ్ కు కొత్త డాన్ వచ్చాడు ..అతడే డేవిడ్ వార్నర్ ఖాన్


డేవిడ్ వార్నర్ ..ఇతర దేశాలలో కేవలం ఒక క్రికెట్ ఆటగాడిగానే పరిచయం కానీ ఇండియాలో మాత్రం ఆటగాడిగానే గాక తన వీడియోలతో ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాడు..కరోనా లాక్ డౌన్ టైం లో తెలుగు హీరోలు అల్లు అర్జున్ , మహేష్ సినిమాల పాటలకు డాన్సులు చేసి బాగా పేరు తెచ్చుకున్న వార్నర్ తాజాగా ఇండియ సినిమా హీరోలను ఇమిటేట్ చేస్తూ మరోక వీడియో పెట్టాడు...

ఏఐ ఫేస్‌యాప్‌ ఉపయోగించి వార్నర్‌ డాన్‌-2 సినిమాలో షారుక్‌లా కనిపించాడు. వీడియోలో అతనిలా స్టంట్స్‌ చేస్తూ యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఇరగదీశాడు. ' ఇంత వయొలన్స్‌ నేను ఎప్పుడూ చేయలేనని.. కానీ ఈ హీరో ఎవరో మీకు అర్థమై ఉంటుందంటూ క్యాప్షన్‌ జత చేశాడు...

దీంతో పాటు హృతిక్‌ కీలకపాత్ర పోషించిన జోదా అక్బర్‌ సినిమాలో హృతిక్‌ పాత్రలో వార్నర్‌ మెరవడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డాన్‌-2 సినిమాకు దర్శకత్వం వహించిన ఫర్హాన్‌ అక్తర్‌ వార్నర్‌ వీడియోపై వినూత్న రీతిలో స్పందించాడు. బాలీవుడ్‌కు కొత్త డాన్‌ వచ్చాడు. అతనే డేవిడ్‌ వార్నర్‌.. సారీ డేవిడ్‌ ఖాన్‌ అంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు.

Tags :
|

Advertisement