Advertisement

  • మహేష్ బాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

మహేష్ బాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

By: Sankar Sun, 09 Aug 2020 5:04 PM

మహేష్ బాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్



లాక్ డౌన్ తన టిక్ టాక్ వీడియోలతో అభిమానులను , ముఖ్యంగా తెలుగు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరొక సారి అభిమానులను ఆకట్టుకున్నాడు అయితే ఈ సారి టిక్ టాక్ వీడియో తో కాకుండా బర్త్ డే విషెస్ తో ..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌.. మ‌హేష్‌కి త‌న‌దైన స్టైల్‌లో బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలోని మైండ్ బ్లాక్ అనే సాంగ్‌కి త‌న భార్య‌తో క‌లిసి చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ విషెస్ అందించారు. హ్యాపీ బ‌ర్త్‌డే లెజెండ్ మ‌హేష్ అంటూ వార్న‌ర్ ట్వీట్ చేయ‌డం గ‌మ‌న‌ర్హం.

కరోనా వ‌ల‌న క్రికెట్‌కి దూరంగా ఉంటూ ఇంటికే ప‌రిమితమైన డేవిడ్ వార్న‌ర్ సౌత్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన సినిమాల‌లోని హిట్ సాంగ్స్‌కి టిక్ టాక్ వీడియోలు చేశారు. ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అలరించాయి. తెలుగులో మ‌హేష్‌, అల్లు అర్జున్ సినిమాల‌లోని సాంగ్స్‌, డైలాగ్స్‌కి వార్న‌ర్ అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు డేవిడ్.


Tags :
|
|

Advertisement