Advertisement

టిక్ టాక్ నిషేధంపై స్పందించిన వార్నర్

By: Sankar Thu, 02 July 2020 7:44 PM

టిక్ టాక్ నిషేధంపై స్పందించిన వార్నర్



చైనీస్ సోషల్ మీడియా అప్లికేషన్ టిక్‌టాక్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో ఈ యాప్ పనిచేయకుండా పోయింది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ నిషేధంపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిపై స్పందించాడు. టిక్‌టాక్ బ్యాన్‌పై తాను ఏమీ చేయలేనని, తన చేతిలో ఏమీ లేదని వార్నర్ అన్నాడు. ప్రజలు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాలని, దానికి తగ్గట్టుగా నడుచుకోవాలని సూచించాడు.

అయితే క్రికెట్లో తన అరివీర భయంకర బ్యాటింగుతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడే డేవిడ్ వార్నర్ ..లాక్ డౌన్ కావడంతో టిక్ టాక్ లో తన అభిమానులను అలరించాడు ..ముఖ్యంగా ఐపీయల్ లో తాను ఆడే సన్ రైజర్స్ టీం తెలుగు కావడంతో ఎక్కువగా తెలుగు సినిమాలకు సంబంధించిన టిక్ టాక్ లు చేస్తూ అలరించాడు ..

ముఖ్యంగా బుట్ట బొమ్మ , మైండ్ బ్లాక్ , బాహుబలి వంటి వీడియోలతో అభిమానుల్లో వీపరీతమైనా ఫాలోయింగ్ సంపాదించాడు ..అయితే ఇపుడు టిక్ టాక్ ను నిషేధించడంతో వార్నర్ అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు

Tags :
|

Advertisement