Advertisement

  • డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

By: Sankar Tue, 20 Oct 2020 4:42 PM

డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ


నజఫ్ఘర్ నవాబ్ , ఇండియన్ క్రికెట్ లెజెండ్ , డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నేటితో 42 వ వసంతంలోకి అడుగుపెట్టాడు ..దీనితొ అన్ని వైపులా నుంచి సెహ్వాగ్ మీద బర్త్డే విషెస్ వర్షం కురుస్తుంది..భారత క్రికెటర్లు అందరు సెహ్వాగ్ కు పుట్టిన రోజు విషెస్ చెప్పారు ..సెహ్వాగ్ కూడా వారందరికీ రిప్లై ఇస్తూ కృతజ్ఞతలు చెప్పాడు..

హ్యాపీ బర్త్ డే వీరూ బాయ్. నాకు పెద్దన్న, నాలో ఎప్పుడూ స్ఫూర్తి నింపడంతోపాటు జీవితంలో మార్గదర్శిగా నిలిచావ్. నీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని రైనా ట్వీట్ చేశాడు. దీనికి వీరూ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్యూ సురేశ్. ఈ ఐపీఎల్‌లో నిన్నెంతో మిస్సయ్యాం. నువ్వు త్వరగా తిరిగొస్తావని ఆశిస్తున్నా’’ అని బదులిచ్చాడు.

ఇక సిక్సర్లు, ఫోర్లతో మాత్రమే డీల్ చేసే సెహ్వాగ్ 42వ ఏట అడుగుపెడుతున్నాడు. ఇది కూడా 6 వస్తుంది. వందేళ్లు వర్థిల్లు. జన్మదిన శుభాకాంక్షలు సెహ్వాగ్’ అని సచిన్ ట్వీట్ చేయగా.. ‘‘థ్యాంక్యూ గాడ్ జీ.. మీరు వందలతోనే (సెంచరీలతో) డీల్ చేస్తారు. క్రికెట్‌కు మీరు చేసిన సేవల్ని వర్ణించడానికి అంకెలు సరిపోవు. స్ఫూర్తిగా నిలిచినందుకు.. శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు’’ అని వీరూ బదులిచ్చాడు.

Tags :
|
|

Advertisement