Advertisement

బాలీవుడ్‌లోని డార్క్ సీక్రెట్స్

By: chandrasekar Tue, 08 Sept 2020 7:44 PM

బాలీవుడ్‌లోని డార్క్ సీక్రెట్స్


బాలీవుడ్‌లోని స్టార్ వారసత్వం, బంధుప్రీతి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమిర్ ఖాన్ సోదరుడు, నటుడు ఫైజల్ ఖాన్ ఈ విషయాల గురించి తాజాగా స్పందించారు.

ప్రపంచం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. అందులో బాలీవుడ్ కూడా భాగమే. `బాలీవుడ్‌లో గ్రూపిజం, బంధుప్రీతి ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి స్వలాభం గురించే ఆలోచిస్తారు. మీరు పరాజయాల్లో ఉంటే మిమ్మల్ని చిన్నచూపు చూస్తారు. నాకూ అలా జరిగింది.

నా సోదరుడు ఆమిర్ 50వ జన్మదినోత్సవ వేడుకలో కరణ్ జోహార్ నాతో అమర్యాదగా ప్రవర్తించాడు. నా గురించి చులకనగా మాట్లాడాడు. నేను వేరొకరితో మాట్లాడుతుంటే మా సంభాషణ కట్ చేయడానికి ప్రయత్నించాడు` అని ఫైజల్ అన్నారు. ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకుండా మనుగడ సాగించడం కష్టమని ఫైజల్ ఖాన్ చెప్పారు.

Tags :
|

Advertisement