Advertisement

  • డేర్ డెవిల్ బైక్ రైడర్.. కెప్టెన్ శివం సింగ్ సరికొత్త వరల్డ్ రికార్డ్ కోసం ప్రదర్శించిన స్టంట్‌లో అపశృతి...

డేర్ డెవిల్ బైక్ రైడర్.. కెప్టెన్ శివం సింగ్ సరికొత్త వరల్డ్ రికార్డ్ కోసం ప్రదర్శించిన స్టంట్‌లో అపశృతి...

By: chandrasekar Thu, 12 Nov 2020 1:20 PM

డేర్ డెవిల్ బైక్ రైడర్.. కెప్టెన్ శివం సింగ్ సరికొత్త వరల్డ్ రికార్డ్ కోసం ప్రదర్శించిన స్టంట్‌లో అపశృతి...


సరికొత్త వరల్డ్ రికార్డ్ కోసం భారత సైన్యానికి చెందిన డేర్ డెవిల్ బైక్ రైడర్.. కెప్టెన్ శివం సింగ్ ప్రదర్శించిన స్టంట్‌లో అపశృతి చోటుచేసుకుంది.

స్టంట్‌లో భాగంగా శివం.. 127 మీటర్లు ఫైర్ టన్నెల్ (అగ్గితో నిండిన సొరంగం) నుంచి బైకుపై వేగంగా ప్రయాణించాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా మంగళవారం బెంగళూరులోని ఓ మైదానంలో ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెక్కలతో నిర్మించిన తాత్కాలిక సొంరంగానికి మంటలు అంటించారు.

నిప్పులు కక్కుతున్న ఆ సొరంగం నుంచి శివం బైకుపై వేగంగా దూసుకెళ్లారు. దీంతో ఆయన దుస్తులకు, బైకుకు మంటలు అంటుకున్నాయి.

బైకు పూర్తిగా దగ్దం కాగా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన ఇన్రికో స్కీయోమ్యాన్, ఆండ్రే డే కాక్ పేరు మీద ఉండేది.

వీరు 120.40 మీటర్ల పొడవైన ఫైర్ టన్నెల్ నుంచి బైకుపై ప్రయాణించి వరల్డ్ రికార్డు నెలకొలిపారు. అయితే, శివం 127 మీటర్ల లక్ష్యాన్ని అధిగమించారో లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Tags :

Advertisement