Advertisement

  • అతడికి మద్దతు ఇచ్చారు మరి నాకు ఎందుకు ఈ అన్యాయం ...డేనిష్ కనేరియా

అతడికి మద్దతు ఇచ్చారు మరి నాకు ఎందుకు ఈ అన్యాయం ...డేనిష్ కనేరియా

By: Sankar Fri, 18 Dec 2020 1:56 PM

అతడికి మద్దతు ఇచ్చారు మరి నాకు ఎందుకు ఈ అన్యాయం ...డేనిష్ కనేరియా


పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ మొహమ్మద్ అమిర్ అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే...తన రిటైర్మెంట్ ప్రకటనలో పాక్ క్రికెట్ బోర్డు వేధింపులు భరించలేకే తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు..అయితే దీనికి ఆ దేశ మాజీ ఆటగాళ్ల నుంచి అమిర్ కు మద్దతు లభిస్తుంది..అయితే పాక్‌ మాజీ స్పిన్నర్‌ దానిష్‌ కనేరియా ఆమిర్‌కు వస్తున్న మద్దతును తప్పుబడుతూ ట్విటర్‌లో కామెంట్‌ చేశాడు..

పీసీబీ మెంటల్‌ టార్చర్‌ భరించలేక రిటైర్మెంట్‌ ప‍్రకటిస్తున్నట్లు ఆమిర్‌ ప్రకటించాడు. అది ఆమిర్‌ వ్యక్తిగత నిర్ణయం.. అతని నిర్ణయాన్ని నేను తప్పుబట్టను. స్పాట్‌ ఫిక్సింగ్‌ తర్వాత దోషిగా తేలిన ఆమిర్‌ మళ్లీ పాక్‌కు క్రికెట్‌ ఆడాడు. అయితే పీసీబీ అదే ధోరణిలో అతను చూడడంతో ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. కానీ ఆమిర్‌ విషయంలో పీసీబీని తప్పుబడుతూ పలువురు మాజీ, స్టార్‌ క్రికెటర్లు మద్దతు పలికారు.

గతంలో ఇదే పీసీబీ విషయంలో నాకు న్యాయం జరగాలని వారికి విజ్ఞప్తి చేశాను.. అప్పుడు నేను మతం కార్డును ఉపయోగించానన్న కారణంతో ఏ ఒక్క క్రికెటర్‌ మద్దతుగా నిలవలేదు. ఆమిర్‌కు ఇచ్చిన విలువలో కనీసం సగం ఇచ్చినా బాగుండు అనిపించిందంటూ' ట్వీట్‌ చేశాడు

Tags :
|

Advertisement