Advertisement

ప్రమాదకరమైన హైడ్రాక్సీక్లోరోక్విన్‌

By: chandrasekar Tue, 26 May 2020 4:38 PM

ప్రమాదకరమైన హైడ్రాక్సీక్లోరోక్విన్‌


హెడ్రాక్సీక్లోరోక్విన్ కరోనాను జయించే దివ్యౌషధం అన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అయితే ఏకంగా తాను ఆ మందులనే వాడుతున్నానని, ఆ మందు రక్షణ రేఖ అని వ్యాఖ్యానించారు.

ఈ మందు కోసం ప్రపంచ దేశాలు భారత్ చేయి చాచాయి. అయితే, అది అత్యంత ప్రమాదకరమైనదని మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. దీంతో డబ్ల్యూహెచ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికి హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్ ఆపేయాలని నిర్ణయించింది. తన మద్దతుతో జరుగుతున్న చోట్లలో వీటిపై నిషేధం విధించింది. ఆ మందు వాడకం కోవిడ్19 రోగులకు ప్రమాదకరంగా మారుతోందని ఓ అధ్యయనం చెప్పినట్లు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఆ తర్వాతే డబ్ల్యూహెచ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :
|

Advertisement